కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు…!

భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు

ఎమ్మెల్యే చెప్పినందుకే తమ బర్ల షెడ్డు అన్యాయంగా కూల్చేశారని బర్లను తీసుకెళ్లి నిరసన తెలిపిన రైతులు

జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం వేషాలపల్లి గ్రామంలోని తమ బర్ల షెడ్డును అధికారులు కూల్చేశారని ఎమ్మెల్యే కార్యాలయానికి బర్లతో వచ్చి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు కూరాకుల ఓదెలు, లలిత

ఎమ్మెల్యే చెబితేనే కూల్చేశామని పోలీసులు చెప్తున్నారని, షెడ్డు లేకుండా మా బర్రెలు ఎక్కడ ఉండాలని ఆగ్రహ వ్యక్తం చేసిన పాడి రైతులు

ఒక్క రూపాయి తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ నిలదీసిన రైతు దంపతులు

షెడ్డు నిర్మించే వరకు బర్లను తీసుకెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్న రైతులు..