టాలీవుడ్‌లో ఎవరి కుంపటి వారిదే: అల్లు అరవింద్‌ కీలక వ్యాఖ్యలు…!

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత, అగ్రహీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్….
సైమా అవార్డులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కార్యక్రమం ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు..అయితే సైమా ఈవెంట్ అనౌన్స్ తో పాటు ఇటీవల నేషనల్ అవార్డులు గెలుచుకున్న తెలుగు వారిని పిలిచి అభినందించారు. వారితో మాట్లాడించారు.
(South Indian International Movie Awards)
ఈ క్రమంలో ఈవెంట్ కి హాజరయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలుగులో మనకు ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించి వాళ్ళందర్నీ ఒక స్టేజి మీదకు తీసుకొచ్చి సత్కరించడం హర్షించదగ్గ విషయం. మనకు ఏడు అవార్డులు వచ్చాయి. అందులో తెలుగు విభాగంలోనే కాక నేషనల్ వైడ్ అవార్డులు కూడా వచ్చాయి. దీన్ని ఒక పంగలా జరుపుకోవాలి కానీ ఇక్కడ సంగతి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి…