మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధాన్ని గెలిచిన మనం…. సీఎం రేవంత్

తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని, జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు..అహింసా పద్ధతిలో మహాసంగ్రామాన్ని గెలిచామని, స్వాతంత్ర్య పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని రేవంత్ రెడ్డి అన్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు…ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం..మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్యపాలనకు పునాదులు వేసుకున్నాం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిత్ జవహర్‌ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది. మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది…