తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..అధికారికంగా పండగ నిర్వహించిన ఘనత కెసిఆర్ దే.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..

అధికారికంగా పండగ నిర్వహించిన ఘనత కెసిఆర్ దే..

కెసిఆర్ హయాంలో ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు అందజేసినం..

కాంగ్రెస్ వచ్చింది.. బతుకమ్మ చీరలు బందైనయ్..

*గత ఏడాది ఇస్తున్నామని ఆశపెట్టి మహిళల ఆశలు ఆవిరి చేసిండ్రు..*

*ఈ ఏడాదైనా చీరలు ఇస్తారో లేదో అని ఎదురు చూస్తున్నారు..*

*ఆడపడుచులకు ఇచ్చే చీరల్లో కూడా ఇంత నిర్లక్ష్యమా..*

*బతుకమ్మ, దేవినవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి..*

*ప్రజలందరికీ బతుకమ్మ, శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..*

*:- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి*

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అదివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఐక్యతతో ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మను అధికారికంగా నిర్వహింకునేలా చేసిన ఘనత ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఆనాటి నుంచే బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసి.. తెలంగాణ మహిళల పట్ల కెసిఆర్ కు ఉన్న ఆదరాభిమానాలను చాటుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కెసిఆర్ హయాంలో ప్రతీ ఏడాది ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు అందించామన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. బతుకమ్మ చీరలు బందైనాయన్నారు. గత ఏడాది చీరలు ఇస్తున్నామని ఆశపెట్టి మహిళల ఆశలు ఆవిరి చేశారన్నారు. ఈ ఏడాదైనా ఇస్తారో లేదో అని ఎదురు చూస్తున్నారని.. ఆడపడుచులకు ఇచ్చే చీరల్లో కూడా ఇంత నిర్లక్ష్యం సరికాదన్నారు. ఏదిఏమైనా పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.