ట్రంప్ కు బిగ్ షాక్….. అమెరికా నిర్ణయానికి పాక్ యూటర్న్ !…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ లో భాగంగా ఆయనకు దగ్గరవుతున్న పాకిస్తాన్ తాజాగా భారీ షాకిచ్చింది..తాజాగా అమెరికా వేదికగా ఆమోదించిన ఓ ప్లాన్ పై యూటర్న్ తీసుకుంది. వాస్తవానికి ఈ ప్లాన్ విషయంలో పాకిస్తాన్ పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించిన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ పాలకుల వైఖరిపై స్వదేశంలో తలెత్తిన నిరసనలే…పాలస్తీనాలోని గాజా పునర్ నిర్మాణం విషయంలో ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను స్వయంగా వాషింగ్టన్ లో పాకిస్తాన్ పాలకులకు ఇచ్చారు. దీన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఆమోదించారు. ఇందులో హమాస్ ఆయుధాలు వీడాలని, గాజా పాలనకు ఏర్పాటు చేసే సంస్థకు ట్రంప్ అధిపతిగా ఉంటారని, ఇలా పలు అంశాలున్నాయి. వీటిని పాకిస్తాన్ పాలకులు ఆమోదించగానే ట్రంప్ ప్రశంసించారు. కానీ వారి స్వదేశంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇది వ్యతిరేకంగా ఉందని వారు ఆరోపించారు..పాలస్తీనాలోని గాజా పునర్ నిర్మాణం విషయంలో ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను స్వయంగా వాషింగ్టన్ లో పాకిస్తాన్ పాలకులకు ఇచ్చారు. దీన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఆమోదించారు. ఇందులో హమాస్ ఆయుధాలు వీడాలని, గాజా పాలనకు ఏర్పాటు చేసే సంస్థకు ట్రంప్ అధిపతిగా ఉంటారని, ఇలా పలు అంశాలున్నాయి. వీటిని పాకిస్తాన్ పాలకులు ఆమోదించగానే ట్రంప్ ప్రశంసించారు. కానీ వారి స్వదేశంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇది వ్యతిరేకంగా ఉందని వారు ఆరోపించారు…ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన ఈ 20 అంశాలు తాము ఆమోదించినవి కావని ఇషాక్ దార్ తెలిపారు. ఇవి తమవి కావన్నారు. తమకు ఇచ్చిన ముసాయిదాలో కొన్ని మార్పులు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో తాను అనుకున్న గాజా ప్లాన్ పై పాకిస్తాన్ మద్దతు పొందడం ద్వారా ఇస్లామిక్ దేశాలను నియంత్రించాలని ట్రంప్ వేసిన వ్యూహం కాస్తా బెడిసికొట్టింది. పాక్ మినహా ఇతర ఇస్లామిక్ దేశాలు సహజంగానే ఈ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నాయి..