Hyderabad

నగరంలో భూముల ధర సరికొత్త రికార్డు నమోదు చేసింది..

ఏకంగా ఎకరం రూ.177 కోట్లు పలికింది..

రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసి వేలం వేసింది..

దీంట్లో పాల్గొన్న ఏం ఎస్ ఎన్ రియాల్టీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది…..

రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రభుత్వ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికి రికార్డు నెలకొల్పింది. ఈ ప్రాంతంలో ఉన్న 18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ వేలం వేసింది. దీంట్లో పాల్గొన్న ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని వేలంలో సొంతం చేసుకుంది. ఒక్క ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1357 కోట్లకు చేజిక్కించుకుంది. మరో 11 ఎకరాలకు వేలం ప్రక్రియ కొనసాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసి) నిర్వహించిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం పాటలో ఎకరా భూమికి ఏకంగా రూ. 177 కోట్లు చెల్లించి ఎంఎస్ఎన్ రియాల్టీ ఈ భూములను సొంతం చేసుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (సర్వే నంబరు 83/1)లోని మొత్తం 18.67 ఎకరాల్లో భాగంగా ఉన్న 7.67 ఎకరాలను ప్రభుత్వం టీఎస్‌ఐఐసీ ద్వారా వేలం వేసింది.

హోరా హోరీగా పోటీ : రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టీజీఐఐసీ ఈ వేలం కోసం ఎకరాకు రూ. 101 కోట్లుగా ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ వేలంలో ఎంఎస్ఎన్, హెటెరో, మేఘా, బ్రిగేడ్ గ్రూప్, సత్వ, ప్రెస్టీజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు హోరా హోరీగా పోటీ పడ్డాయి. ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఈ వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ ఒక్క ఎకరా భూమిని రూ. 177 కోట్లకు దక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించింది.

ఈ ధరతో మొత్తం 7.67 ఎకరాలను ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఏకంగా రూ.1,357 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ రికార్డు స్థాయి ధర, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని, ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఉన్న రాయదుర్గం ఏరియా ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది..