బహుళ అంతస్తుల భవనంలో సుమారు 150 ఏళ్ల క్రితమే విద్యుత్తు అవసరం లేని లిఫ్ట్‌లను ఉపయోగించిన నిజాం నవాబులు..!

హైదరాబాద్‌: బహుళ అంతస్తుల భవనంలో పైకెళ్లాలంటే ‘లిఫ్ట్‌’ ఉండాల్సిందే. కానీ సుమారు 150 ఏళ్ల క్రితమే విద్యుత్తు అవసరం లేని లిఫ్ట్‌లను నిజాం నవాబులు వినియోగించేవారు. బలమైన తాళ్లు, చక్రాలతో రూపొందించిన లిఫ్ట్‌ను మనుషులే ఆపరేట్‌ చేసేవారు. ఆరో నిజాం మీర్‌మెహబూబ్‌ అలీఖాన్‌ మొదటగా వినియోగించారు. ఆ తర్వాత చివరి నిజాం నవాబైన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సైతం ఈ లిఫ్ట్‌ని వాడేవారు. లండన్‌కి చెందిన ఆర్‌వే గుడ్‌ కంపెనీ ఈ లిఫ్ట్‌ని తయారు చేసింది. ఎనిమిది మంది సామర్థ్యంతో పైఅంతస్తుకు వెళ్లవచ్చు. చెక్కతో చేసిన ఈ లిఫ్ట్‌ ఇప్పటికీ పనిచేసే స్థితిలో ఉండటం విశేషం. దీన్ని సందర్శకుల కోసం పురానాహవేలీలోని నిజాం మ్యూజియంలో ఉంచారు..