నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. స్థానిక ఈస్ట్రన్ కాలువలో తేలియాడుతున్న శవాన్ని చూసి స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు..స్థానికులు వెంటనే పోలీస్, పంచాయితీ సిబ్బందికి సమాచారం అందించారు. కాలువ వద్దకు పెద్దసంఖ్యలో గ్రామస్తులు చేరి ఆ శవం ఎవరికంటే అనేది చర్చలో పడ్డారు. అంతలో ఓ వ్యక్తి ధైర్యం చేసి కాలువలోకి దిగి.. ఆ ప్రాంతానికి వెళ్లి కనిపిస్తున్న కాలును పట్టుకుని లాగాడు. ట్విస్ట్ ఏంటి అంటే అది శవం కాదు. ఓ చెక్క బొమ్మ. నీటి ఉధృతికి ఎక్కడినుంచో కొట్టుకువచ్చి అక్కడ చిక్కుకుని ఆగిపోయింది. దీంతో స్థానికులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.