హరీశ్‌ రావుకు పితృవియోగం…!

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సిద్ధపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. తన బావతో (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ గారి భర్త) తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీశ్‌ రావును ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో కోకాపేటలోని హరీశ్‌ రావు నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.