ఆస్ట్రేలియా పర్యటనలో భారత టీ20 జట్టు అదరగొడుతున్నది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మెరిసి కంగారూలపై 48 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని నమోదుచేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అక్షర్ పటేల్ (బ్యాట్‌తో 21*, బంతితో 2/20) ఆల్‌రౌండ్ షో తో సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167కే పరిమితమైంది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మోస్తరు ఛేదనలో ఆసీస్.. 18.2 ఓవర్లలో 119 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 30, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అక్షర్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (3/3) మ్యాజికల్ స్పెల్‌తో ఆసీస్ లోయరార్డర్ పనిపట్టగా వరుణ్ చక్రవర్తి (2/20), శివమ్ దూబే (2/20) తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20 శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్‌లో జరుగుతుంది…
భారత జట్టు విజయం పై మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav ) స్పందించాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో పాటు బౌలర్ల కృషితోనే విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. ‘ఈ పిచ్ పై 200 పరుగులు చేయడం కష్టమని ఓపెనర్లు గ్రహించారు. ఈ క్రమంలోనే పరిస్థితులకు తగ్గట్లుగా వారు బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో సాధ్యమైనన్ని పరుగులు సాధించారు. ఇక మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించడంతో పోరాడే స్కోరును సాధించాము.’ అని సూర్య అన్నాడు.
బౌలింగ్‌లో ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయ్..
డగౌట్ నుంచి నుంచి కూడా ఎప్పటికప్పుడూ సందేశాలు అందుతూనే ఉన్నాయన్నాడు. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తాను దాదాపుగా ఒకేలా ఆలోచిస్తామని తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కాస్త మంచు ప్రభావం ఉన్నప్పటికి కూడా బౌలర్లు పరిస్థితులకు వేగంగా అలవాటు పడ్డారని చెప్పుకొచ్చాడు. ఇక బౌలింగ్‌లో ఎక్కువ అప్షన్లు ఉండడం తమకు కలిసి వచ్చే అంశం అని తెలిపాడు. పిచ్ కండిషన్స్ బట్టి ఏ బౌలర్‌తో ఎన్ని ఓవర్లు వేయించాలనే నిర్ణయాన్ని తీసుకుంటానని తెలిపాడు..
AUS vs IND 4th T20I: All-Round India Clinch 48-Run Win Over …
ఈ క్రమంలోనే కొన్ని మ్యాచ్‌ల్లో వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తాడని, మరికొన్ని మ్యాచ్‌ల్లో రెండు, మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయవచ్చునన్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబెలతో పాటు మిగిలిన బౌలర్లకు ఇదే జరగొచ్చునన్నాడు. జట్టు కోసం రాణించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారన్నాడు…