🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪷పంచాంగం🪷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 07 – 11 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : *విదియ* మ2.28 వరకు,
నక్షత్రం : *కృత్తిక* ఉ6.59 వరకు,
తదుపరి *రోహిణి* తె5.21 వరకు,
యోగం : *వరీయాన్* ఉ6.46 వరకు,
తదుపరి *పరిఘము* తె3.38 వరకు,
కరణం : *గరజి* మ2.28 వరకు,
తదుపరి *వణిజ* రా1.19 వరకు,
వర్జ్యం : *రా9.53 – 11.22*
దుర్ముహూర్తము : *ఉ8.19 – 9.05*
మరల *మ12.06 – 12.51*
అమృతకాలం : *ఉ6.14వరకు*
మరల *రా2.21 – 3.51*
రాహుకాలం : *ఉ10.30 – 12.00*
యమగండం : *మ3.00 – 4.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం : *6.04*
సూర్యాస్తమయం : *5.24*
*_నేటి మాట_*
*భక్తునికి – భగవంతుడు ఎలా వశమవుతాడు??*
ఈరోజు అందరూ భక్తులే, మరి మనలోపల ఎలాంటి భక్తి ఉంటే భగవంతుడు ఇష్టపడతారు ?? అనేది ముఖ్యం…
డబ్బులు, అధికారం, ఉంటే ఏ దేవుడైన మనం దర్శించుకోవచ్చు , అనుభవించవచ్చు అని భావం అందరిలోపల ఉంటుంది…
కానీ అది అంతా వృథా … నువు ఎన్ని గుళ్ళు, ఎన్ని గోపురాలు తిరిగినా, దర్శించినా, మన లోపలి అహంకారము నిర్మూలమైనప్పుడే పరిశుద్ధమైన భక్తి ప్రారంభమవుతుంది…
*Devotion అంటే యేమిటి?*
జపము చేయటమో, భజన చేయటమో వ్రతములు చేయటమో ఇవి మాత్రమే devotion అనగా భక్తి అని మనం అనుకుంటున్నాము,
విష్ణుస్వరూపమైన విశ్వాసాన్ని మనము ప్రేమించాలి.
*అనగా ఏమిటి?* విష్ణుత్వమనగా సర్వవ్యాపకత్వమని అర్థము, అనగా సర్వమానవుల యందు దైవత్వమును మనము గుర్తించాలి.
‘విశ్వం విష్ణు స్వరూపం, భజ సేవాయాం’, అది భక్తి యొక్క వుత్పత్తి.
అహంకారము నిర్మూలమైనప్పుడే పరిశుద్దమైన భక్తి ప్రారంభమవుతుంది.
ఎప్పుడు యీ భక్తి మనలను అభివృద్ధి గావింపచేస్తుందో అప్పుడే discipline, అనగా క్రమశిక్షణ ఏర్పడుతుంది, అప్పుడే భక్తుడికి భగవంతుడు వశమవుతాడు.
*_🪷శుభమస్తు🪷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏