ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నారు: పాక్.

సంతకం… కేవలం ఒకే ఒక్క సంతకం… ఒక దేశ చరిత్రను, ఒక శక్తివంతమైన నాయకుడి తలరాతను ఎలా మార్చేస్తుందో తెలుసా? 2019లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం, ఇప్పుడు 2025లో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లోని అడియాలా జైలు గోడల వెనుక అసలేం జరుగుతోంది?, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా? లేక బయటకు పొక్కనివ్వకుండా ఏదైనా జరగరానిది జరిగిందా? అర్ధరాత్రి కరెంట్ తీసేసి… ఆయన కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?, ఇది రాజకీయమా? లేక ఒక ఆర్మీ జనరల్ తీర్చుకుంటున్న వ్యక్తిగత పగా?, పాకిస్తాన్ రాజకీయ చదరంగంలో జరుగుతున్న అసలు కథను, దాని వెనుక ఉన్న రక్తచరిత్రను దాగుంది..

ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నారు: పాక్..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతిచెందినట్లు వచ్చిన వార్తలను అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా స్పందించారు.

ఇమ్రాన్ జైలులోనే సౌకర్యవంతంగా ఉన్నారని, ఆయనకు మంచి ఆహారం, సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తోషఖానా, సైఫర్ సహా దాదాపు 200 కేసులతో ఆయన 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు.