*బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, 12 మృతి..*
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం..
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు –మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్లు అమరులయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అడవుల్లో ఇతర నక్సల్స్ కోసం గాలింపు కొనసాగుతోందని భద్రతా బలగాలు తెలిపాయి. బస్తర్ డివిజన్లోని దంతెవాడను ఆనుకుని ఉన్న గంగాలూరు ప్రాంత అడవుల్లో నక్సల్స్ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పాటలింగం తెలిపారు. ఈ సమయంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. DRGతో పాటు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, CRPF కోబ్రా కమాండోలు నాయకత్వం వహించగా 12 మంది మావోయిస్టులు మరణించారు.
ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అడవి చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టినట్లు బలగాలు తెలిపాయి. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సింగిల్-లోడింగ్ రైఫిల్స్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.