గోవాలో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23మంది మృతి…

ఉత్తర గోవాలో (Goa) ఘోర అగ్ని ప్రమాదం (Fire Acciden) జరిగింది. అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్‌ బై రోమియో లేన్ అనే నైట్‌ క్లబ్‌లో (Night Club) అర్ధరాత్రి సమయంలో సిలిండర్‌ పేలడంతో (Cylinder Blast) మంటలు చెలరేగాయి. దీంతో 23 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యటకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగతా వారంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు..

ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యటకులు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు…

ప్రమాద స్థలాన్నిపరిశీలించిన సీఎం
అర్పొరా గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్‌ క్లబ్‌ను గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ పరిశీలించారు. నైట్‌క్లబ్‌లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ఈ క్లబ్‌ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్‌ సావంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్ట ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు…

స్పందించిన రాష్ట్రపతి
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నరు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు..