నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 23 – 12 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,

తిథి : తదియ ఉ10.27 వరకు
నక్షత్రం : శ్రవణం తె5.41 వరకు
యోగం : వ్యాఘాతం సా4.06 వరకు
కరణం : గరజి ఉ10.27 వరకు
తదుపరి వణిజ రా10.38 వరకు,

వర్జ్యం : *ఉ8.49 – 10.30*
దుర్ముహూర్తము : *ఉ8.41 – 9.25*
మరల రా10.40 – 11.32
అమృతకాలం : సా6.50 – 8.30
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండం : ఉ9.00 – 10.30
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 6.30,
సూర్యాస్తమయం : 5.27,

నేటి పాశురం.

తిరుప్పావై – 8వ పాశురము.

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరు వీడు.
మేయ్వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్.
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై.
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ.
పావాయ్ ! ఎళు న్దిరాయ్, పాడిప్పరై కొణ్డు _
మావాయ్  పిళన్దానై మల్లరై మాట్టియ.
దేవాదిదేవనై చ్చెన్రు నామ్ శేవిత్తాల్.
ఆవా వెన్రారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్..

తాత్పర్యము:–.

తూర్పుదిక్కు తెల్లవారుచున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్ల లందరును గూడ వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేఱి, అట్లు పోవుటయే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోవువారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా ! ఓ పడతీ ! లేచి రమ్ము ! కృష్ణగుణములను కీర్తించి వ్రతమున కుపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి యను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టినవానిని, దేవతలకు ఆదిదేవుడైనవానిని మనము పోయి సేవించినచో అయ్యో ! అయ్యో ! మీరే వచ్చితిరే ! యని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.

🌷శుభమస్తు🌷_
సమస్త లోకా సుఖినోభవంతు