ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాల ప్రజలు, మహిళల ఆర్థిక అభివృద్ధికోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే, తాజాగా.. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలను ప్రభుత్వ రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఏకీకృత కుటుంబ సర్వే -UFS ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959