అమెరికా: కాలిఫోర్నియా రాష్ట్రంలో వర్ష బీభత్సం.
పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద.
వరదలో కొట్టుకుపోయిన హిల్ రిసార్ట్ కట్టడాలు.
శాన్డియాగోలో చెట్టు కూలి వ్యక్తి మృతి.
శాక్రమెంటోలో పోలీస్ అధికారి దుర్మరణం.
కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్..
https://x.com/AztecaNoticias/status/2004417136664412634?s=20
కాలి ఫోర్నియా(California) రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. హఠాత్తుగా వచ్చిన తుఫాను కారణంగా బలమై గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు చుట్టుముట్టాయి. అనేక U పాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో బురద పేరుకు పోయింది. వాహనాలు, ఇండ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మట్టి చరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి…
ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు
కీలక హైవేలను అధికారులు మూసివేశారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. (America) లాస్ ఏంజిల్స్ కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదలకు ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధిక వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు పండుగ ఆనందాన్ని ఆస్వాదించకుండా వర్షాలు తమను ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రజలు మీడియా ముందు వాపోతున్నారు. అత్యవసర సహాయ.