తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత..!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ(ap-and-telangana)లో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరిగి.. చలి తీవ్రత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ, సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు అయ్యే సరికి కూడా పొగమంచు కురుస్తుండటంతో ఏ పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు…

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959