శ్రీనివాసపురం పాఠశాలకు ఆట వస్తువులు బహూకరణ..
R9TELUGUNEWS.COM
శ్రీనివాసపురం పాఠ శాలకు ఆట వస్తువులు బహూకరణ..
స్థానిక ప్రాధమిక పాఠశాలకు గ్రామ వాస్తవ్యుడు , రిటైర్డ్ టీచర్ పారుపల్లి చంద్రశేఖర్ , లక్ష్మి భవాని దంపతులు విద్యార్థుల అవసరార్ధం రూ.55,000 విలువ చేసే ఉయ్యాల మరియు జారుడు బల్లను బహుకరించడం జరిగింది . ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి భూక్యా సైదా నాయక్ , స్థానిక సర్పంచ్ కట్ట శ్రీనివాసరావు మాట్లాడుచూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను అభినందించడం జరిగింది.. . విద్యార్థుల సంఖ్యను పెంచడానికి సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ , PACS (x) చైర్మన్ కట్టా గోపాలరావు,వార్డు సభ్యులు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాపారావు ,అప్పారావు , సంజీవ్ గాంధీ , రేణుక ,ఉపేందర్ , అరిబండి అప్పారావు,శివరామకృష్ణ, భ్రమరాంబ, వెంకటేశ్వరరావు,రమేష్ రెడ్డి, కమల,పాల్గొన్నారు..
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959