పెద్ద ఎత్తున బ్రీత్ అనలైజర్ పరీక్షలు :.
దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలు అధికంగా జరగడంతోపాటు . కొందరు మద్యం సేవించి, తాగిన మత్తులోనే వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు, అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో దొరికిన వారిపై కేసులు నమోదు చేశారు..
ముషీరాబాద్ డిపో సమీపంలోని ఆజామాబాద్ క్రాస్ రోడ్ వద్ద చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను దూరం నుంచే చూసి పలువురు వెనక్కి తిరిగి పారిపోగా 15 మంది మందు బాబులు చిక్కినట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, రాణిగంజ్, మారేడుపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లోనూ పోలీసులు పెద్ద ఎత్తున బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. బస్సులు, కార్లు, బైక్‌లు సహా అనుమానం వచ్చిన అందరినీ తనిఖీలు చేశారు. తాగి వాహనం నడుపుతూ ఆరుగురు చిక్కినట్లు పోలీసులు తెలిపారు.
మందుబాబులకు నాంపల్లి పోలీసులు ఝలక్ : నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మందుబాబులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు 80 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో కీలక ప్రాంతాల్లో 15 చోట్ల మియాపూర్, చందానగర్‌లోని నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు జరిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన రహదారులలో డ్రంక్ అండ్ డ్రైవ్ కిట్లతో పోలీసులు రోడ్లపైకి వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్లుగా పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు….
కట్టుదిట్టమైన చర్యలతో రోడ్లపై చాలావరకు మందుబాబుల రచ్చ తగ్గిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..
రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా కనబడటం కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959