తిరుపతిలో భద్రతా వైఫల్యం.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం.
తిరుపతి నగరంలోని ప్రముఖ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. ఏకాంత సేవ ముగిసిన అనంతరం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించాడు.
ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన నిందితుడు గోపురంపైకి ఎక్కి, అక్కడ ఉన్న కలశాలను లాగేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చాలా సేపు శ్రమించిన తర్వాత నిందితుడిని సురక్షితంగా కిందికి దింపి అదుపులోకి తీసుకున్నారు..
ఈ ఘటన ఆలయ భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959