తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటింపు..!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, మరియు 16న కనుమ పండుగలు ఉన్నాయి. సాధారణంగా కనుమ రోజున ఐచ్ఛిక సెలవు ఉన్నప్పటికీ.. విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లే సౌకర్యార్థం 16వ తేదీ వరకు పూర్తి సెలవులు పొడిగించారు. పండుగ సెలవుల అనంతరం జనవరి 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు కూడా పాఠశాలల మాదిరిగానే సెలవులను అమలు చేయాలని నిర్ణయించింది. అయితే.. జనవరి 17న తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించాలని బోర్డు సూచించింది.
సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు (DEO) దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచనున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇదే విధమైన సెలవుల షెడ్యూల్ ఉంది. అక్కడ కూడా జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సెలవులు ఉండటంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపాలని యోచిస్తోంది..
పండుగ అనంతరం 17వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులను విద్యార్థులు ఆనందంగా, సురక్షితంగా గడపాలని విద్యాశాఖ సూచించింది…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959