తిరుపతిలో సాక్షి ఫోటోగ్రాఫర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
ఫోటోలు తీస్తున్నాడని పోలీసులే దాడి చేసి తిరిగి ఫోటోగ్రాఫర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
Cr.No.06/2025 u/s 132, 351 BNS సెక్షన్ల కింద.. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ పై కేసు నమోదు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని హెడ్ కానిస్టేబుల్ శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు
ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకు నోటీసులు ఇవ్వనున్న తిరుచానూరు పోలీసులు.!
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడాన్ని
నిరసిస్తూ తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. నల్లచొక్కాలు ధరించి నిరసనకు దిగాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. అయితే ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. అభినయ్ రెడ్డిని అరెస్టు చేసి తిరచానూరు పీఎస్కు తరలించారు. ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల పట్ల పోలీసులు దురుసగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ నేతలను ఈడ్చుకెళ్లారు.
సాక్షి ఫోటో గ్రాఫర్పై తిరుచానూరు పోలీసులు దౌర్జన్యం
ఈ క్రమంలోనే సాక్షి ఫోటో గ్రాఫర్పై దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ నేపథ్యంలో కవరేజ్ కు వెళ్ళిన సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణపై సీఐ సునీల్ కుమార్ దురుసుగా ప్రవర్తించారు. విధినిర్వహణలో ఉన్న ఫోటో గ్రాఫర్ ను బలవంతంగా వెనక్కి నెట్టారు సీఐ..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959