ఒకపక్క చలికి వనికి పోతుంటే.. మరోపక్క వర్షాలు.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. IMD నివేదిక ప్రకారం, ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందనుంది.రానున్న 48 గంటల్లో ఇది మరింత శక్తిని పుంజుకుని తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ, దీని ప్రధాన దిశ తమిళనాడు వైపు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం నామమాత్రంగానే ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు..అలాగే రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం నెలకొంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే, ఉపరితల గాలుల ప్రభావంతో తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, లోతట్టు జిల్లాల్లో విజిబులిటీ తగ్గి, వాహన దారులకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ..
ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం..!
భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి.. పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే చాన్స్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959