మరోసారి హైవే పై ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం..

మరోసారి హైవే పై ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

సెల్ఫ్ మోటార్‌ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో, సురక్షితంగా బయటపడ్డ ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది

సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది..

ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణాలు ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం ఇంకా ప్రజల మనసుల్లో నాటుకుపోయి ఉంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రైవేట్ బస్సుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తుండగా, బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959