ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క..
మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికని మాజీ సీఎం కేసీఆర్ కి అందించిన మంత్రులు.
ఈ నెల 28న ప్రారంభం కానున్న మేడారం జాతరకి రావాలని కోరిన కొండా సురేఖ, సీతక్క.
కేసీఆర్: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్ను మేడారం మహా జాతరకు ఆహ్వానించారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది. మంత్రి సీతక్క ఇప్పటికే పలు రాజకీయ, సామాజిక వర్గాల నేతలను కలిసి మేడారం జాతరకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. అదే నేడు కేసీఆర్ను కలిసి అధికారికంగా మేడారం ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. మేడారం జాతర రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.