నాటకీయ పరిణామాల మధ్య రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపు..!

ది రాజాసాబ్’ సినిమాకి సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.200 (జీఎస్టీతో కలిపి) పెంచుకోడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. పది రోజుల పాటు ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయి…ముందు రోజు రాత్రి ‘ది రాజాసాబ్’ స్పెషల్‌ ప్రీమియర్‌ షోలు పడబోతున్నాయి. జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో షో వేసుకోడానికి పర్మిషన్ ఇచ్చారు. ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.1000 పెంచుకోడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఓజీ తర్వాత ఈ రేంజ్ లో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చిన సినిమా ఇదేనని చెప్పాలి..

నాటకీయ పరిణామాల మధ్య రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి

అర్ధరాత్రి 12 గంటల తరువాత ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఈరోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ ల్లో రూ.132 పెంచుకునేందుకు, ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ ల్లో రూ.89 పెంచుకునేందుకు అనుమతులు

సినిమా విడుదల చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక ఒక మనసున్న మహారాజు లాంటి ఒక నిర్మాత కుట్ర కోణం ఉందని మండిపడుతున్న ప్రభాస్ అభిమానులు..

*ముంబైలో హై అలర్ట్…. పాక్ తీవ్రవాదుల దాడి జరగవచ్చు..!* https://r9telugunews.com/mumbail-allart/

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959