9,10 వ తరగతి ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు పూర్తి చేసి పంపించాలి.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

సూర్యాపేట

9,10 వ తరగతి ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు పూర్తి చేసి పంపించాలి ..

కేజీవిబీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి..

10 వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకొని నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలి…
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…

రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించుటకు ప్రతి ఎం ఇ ఓ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులతో విద్యాశాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 10 వ తరగతి వార్షిక పరీక్షలలో ప్రతి పాఠశాల నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని అలాగే 10 వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్పెషల్ తరగతులు, విద్యార్థులకు అభ్యాసనన పుస్తకాలు అందించాలని , 2 ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, ప్రతి విద్యార్థికి ఎగ్జామ్ పాడ్, పెన్, పెన్సిల్, స్కేలు ఇవ్వాలని సంబంధిత ఏం ఇ ఓ లను కలెక్టర్ ఆదేశించారు.

అలాగే 9,10 వ తరగతి ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్లు సంబంధించి దరఖాస్తులను సమర్పించాలని అవసరమైతే మండల తహసిల్దార్ సహాయంతో మీ సేవ సెంటర్ సిబ్బందిని పాఠశాలలకు పిలిపించి విద్యార్థుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని దరఖాస్తులను జనవరి 20 వ తేది లోపు సమర్పించాలని ఆదేశించారు.

సంక్రాంతి పండుగ సెలవులు తదుపరి పాఠశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవసరమైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పారిశుధ్య పనులు చేయించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం బియ్యం స్టాక్ పెట్టుకోవాలని కలెక్టర్ అన్నారు, సర్వ శిక్ష అభియాన్ కూడ సమీక్షించారు.

ఈ సమావేశంలో డి ఈ ఓ ఆశోక్,ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ అధికారి దయానంద రాణి, కోఆర్డినేటర్లు రాంబాబు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959