బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలో ఓ జెప్టో (Zepto) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై దాడి జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు..
డెలివరీ బాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఢీకొట్టి కిందపడిపోయారు. దీంతో వారిద్దరూ అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డెలివరీ బాయ్‌ను విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, హెల్మెట్‌తో అతని ఛాతీపై బలంగా బాదారు. దెబ్బలను తాళలేక డెలివరీ బాయ్ కిందపడిపోయాడు.
అయితే, డెలివరీ బాయ్‌ని స్కూటీపై వెళ్తున్న ఇద్దరూ కొట్టడం తప్పని భావించిన స్థానికులు, వాహనదారులు..
వారిద్దరికీ బుద్ధి చెప్పారు. ఓ పెద్దాయన వచ్చి చెంపచెల్లుమనిపించారు. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ..
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.