నాటో కూటమి నుంచి తప్పుకొందామని ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆ దేశ పార్లమెంటు ఉపాధ్యక్షురాలు క్లెమెన్స్ గ్యూటే ప్రతిపాదించారు…అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని, అందువల్ల అమెరికా ఆధ్వర్యంలోని నాటోలో ఫ్రాన్స్ కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ”వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేసింది. పాలస్తీనాలో మారణకాండకు మద్దతిచ్చింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి నుంచి తప్పుకోవాలి” అని క్లెమెన్స్ పేర్కొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959