చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి..!

చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

హైదరాబాద్ – కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో, చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ మృతి చెందిన అభిమాని

గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు..

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 210 కోట్ల గ్రాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు సినిమాలకు అత్యుత్తమ సీజన్ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అనిల్ రావిపూడి, చిరంజీవికి సంబంధించి సంక్రాంతి సినిమాలన్నీ మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించాయి.

ఇదిలా ఉండగా సినిమా చూస్తూ ఓ అభిమాని చనిపోవడం స్థానికంగా థియేటర్లో విషాదని మిగిల్చింది.. ప్రస్తుతం ఈ వృత్తిపై పోలీసులు ఓ అవగాహనానికి వచ్చినట్లుగా సమాచారం..హైదరాబాద్ – కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో, చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ మృతి చెందడం అభిమానుల్లో కూడా ఆవేదనకు గురయ్యారు…

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టుగా సమాచారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రి తరలించడం జరిగింది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959