కల్మల్ చెరువు గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు.!

అంగరంగ వైభవంగా.. సంక్రాంతి ముగ్గుల పోటీలు..!

కల్మల్ చెరువు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో.. కెనరా బ్యాంక్ కల్మల్ చెరువు – బ్రాంచ్ మేనేజర్ తరుణ్ కార్ డ్రైవింగ్ స్కూల్ వారి సౌజన్యంతో Z.P హై స్కూల్లో గ్రామ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు!.

నిర్వహించడం జరిగింది.ఈ పోటీలలో 40 మంది మహిళలు పాల్గొనడం జరిగింది.గ్రామంలోని నూతన ఉద్యోగస్తులకు సన్మానం చేసి, మెమెంటో బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్మలచెరువు గ్రామ సర్పంచ్ బచ్చలకూరి శ్రీను, గడ్డిపల్లి కె వి కే శాస్త్రవేత్త కే సుగంధి, జడ్జిలుగా మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, కమిటీ మహిళా ప్రెసిడెంట్ ప్రమీల గారు పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ, తృతీయ బహుమతులు, ఒక కన్సోలేషన్ ప్రైస్ మరియు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ (పారితోషకం) గిఫ్టు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీ బహుమతుల దాతలను , విచ్చేసిన ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించడం జరిగింది.

కల్మల్ చెరువు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో… జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీ మరియు కొత్త ఉద్యోగులకు సన్మానం కార్యక్రమంలో.. బాగంగా ఈరోజు జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని,
స్వామి వివేకానంద స్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జయంతి నివాళులు అర్పించడం జరిగింది.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.