ఓటర్ హక్కులను కాలరాస్తున్నారు – మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు.

సూర్యాపేట జిల్లా.

హుజూర్నగర్,

ఓటర్ హక్కులను కాలరాస్తున్నారు – మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు.

హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఓటర్ జాబితాల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, ఓటర్ హక్కులను కాలరాస్తున్నారని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం హుజూర్నగర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు..

మున్సిపాలిటీ పరిధిలో ముసాయిదా ఓటర్ జాబితా మరియు తుది ఓటర్ జాబితాల మధ్య భారీ తేడాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే ఓటర్ల పేర్లను ఒక వార్డు నుంచి మరో వార్డుకు మార్చడం పూర్తిగా అన్యాయమని అన్నారు. 30–40 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఓటర్లను కూడా వేరే వార్డులకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
ఈ తరహా మార్పులు ప్రజల ఓటు హక్కుతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని జక్కుల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలతో సంబంధం లేకుండా అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
ఓటర్ జాబితాల్లో జరిగిన అక్రమ మార్పులను తక్షణమే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వార్డులను కూడా మార్చడం ఏమిటి? ఇది ఏ నిబంధనల ప్రకారం జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇది ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు..

లేనిపక్షంలో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి, ఓటర్ జాబితాల్లో ఉన్న తప్పులను వెంటనే సరిదిద్దాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959