ఇటీవల రష్యా రక్షణలో ఉన్న వెనిజులా చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నౌకలో అదుపులోకి తీసుకున్న సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉండగా..వారిని ఈరోజు విడుదల చేసారు. రష్యా జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ మారినెరాలో అక్రమంగా చమురును తరలిస్తున్నట్టు ఆరోపిస్తూ.. జనవరి 7న ఐస్లాండ్ సమీపంలోని నార్త్ అట్లాంటిక్ సముద్రంలో వెనిజులా నౌకను అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా..
అందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అనంతరం వీరి విషయంలో మానవీయకోణంలో నిర్ణయం తీసుకోవాలని భారత ప్రభుత్వం, రష్యా ఎంబసీలు అమెరికాను కోరాయి. దీంతో అమెరికా అధికారులు ఆ ముగ్గురు భారతీయులను సోమవారం విడుదల చేశారు. అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతిస్తూ.. సిబ్బంది కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపింది.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959