పాక్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి..!

పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో జరిగిన పేలుళ్లలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొదటి బ్లాస్ట్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని టాంక్ జిల్లాలోని గోమల్ బజార్ లో ఓ పోలీస్ వాహనం వద్ద జరిగింది. ఈ బాంబ్ ను రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పేల్చేసినట్లు సమాచారం. మరో బ్లాస్ట్ లక్కీ మార్వట్ జిల్లాలో జరిగింది. పోలీస్ వ్యాన్ టార్గెట్ గా ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో రెండు భారీ బాంబ్ బ్లాస్ట్ లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా.. మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లు జరిగిన రెండు చోట్లా పోలీసు వాహనాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం. టెర్రరిస్టులు మా పోలీస్ వాహనం టార్గెట్ గా బాంబు పేలుళ్లు జరిపినట్లు స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనను ఇంటీరియర్ మినిస్టర్ మోహసిన్ నక్వీ తీవ్రంగా ఖండించారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్.. టెర్రరిస్టుల ప్లాన్ లను ఛేదించాయని అన్నారు. పేషావర్, బన్ను, ఖైబర్ జిల్లాల్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు స్పష్టం చేశారు. ఎనిమిది మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు వివరించారు…

పాక్ ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని భద్రతా కారణాల దృష్ట్యా మరిన్ని వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు. అయితే పాకిస్తాన్‌ తాలిబన్‌గా పిలవబడే తెహ్రిక్‌-ఎ-తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల టీటీపీ భద్రతా సిబ్బంది, పౌరులపై దాడులను మరింత పెంచింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉగ్రసంస్థ బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్‌పై దాడులకు ఆఫ్ఘన్‌ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతిస్తోందని పాక్‌ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959