ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు తీవ్రం రూపం దాల్చాయి. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా, కాల్పులకు దిగుతున్నా జనం వెనక్కి తగ్గడం లేదు. మహిళలు ఖమేనీ ఫొటోకు నిప్పుపెట్టి సిగరెట్లు వెలిగించుకోవడం ఇటీవల సంచలనం రేపింది. తాజాగా యువతులు బహిరంగంగా బురఖాలు తీసేస్తూ కొందరు తమ నిరసన తెలుపుతున్నారు. టీషర్టులపై ఖమేనీ వ్యతిరేక నినాదాలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలకు అక్కడ మరణశిక్ష విధిస్తారు…
ఆ వీడియోలో ఒక మహిళ తన హిజాబ్ తొలగించి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అభ్యంతరకర సందేశం ఉన్న టీషర్ట్‌ను చూపిస్తూ కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని ఇరాన్‌లోనే జరిగిన ధైర్యమైన నిరసనగా ప్రచారం చేస్తున్నారు.
ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ,”ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు తీవ్రం రూపం దాల్చాయి. అలాగే జర్నలిస్ట్ నబీలా జమాల్ కూడా ఈ వీడియోను Xలో పోస్ట్ చేస్తూ, ఇది ఇరాన్లోనిదేనని పేర్కొన్నారు. “ఇరాన్ – అయతొల్లా అలీ ఖమేనేపై అభ్యంతరకర సందేశంతో టీషర్ట్ చూపించిన మహిళ. ఇలాంటి చర్యకు ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష కూడా ఉండొచ్చు” అంటూ ఆమె రాసింది..
అసలు నిజం..
న్యూస్‌మీటర్ చేసిన పరిశీలనలో, ఈ వీడియో ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలోని ప్లేస్ విక్టర్ హ్యూగో (Place Victor Hugo) వద్ద చిత్రీకరించబడినదిగా తేలింది. వీడియోలో కనిపిస్తున్న మహిళ ఫ్రెంచ్ కార్యకర్త కామిల్ ఎరోస్ (Camille Eros).
వీడియో లొకేషన్ గుర్తింపు (జియోలోకేషన్) రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో ఫేస్బుక్లో కూడా కనిపించింది. అక్కడ ఇది పారిస్‌లో జరిగిన నిరసన కార్యక్రమం అని స్పష్టంగా పేర్కొన్నారు.
వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే భవనాలను గమనిస్తే, అవి పారిస్‌కు ప్రత్యేకమైన హాస్మానియన్ శైలిలో (Haussmannian architecture) ఉన్నట్లు గుర్తించవచ్చు…
ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లభించింది. ఆ పోస్ట్‌లో లొకేషన్‌ను పారిస్‌గా పేర్కొన్నారు.
ఆ ఇన్స్టాగ్రామ్ చిత్రాన్ని జెమినీ (Gemini) టూల్‌తో విశ్లేషించగా, అవి పారిస్ 16వ అరొండిస్మెంట్లోని అవెన్యూ ఫోచ్, అవెన్యూ రేమండ్ పాయంకరే పరిసర ప్రాంతమై ఉండొచ్చని సూచించింది.
గూగుల్ మ్యాప్స్ పరిశీలనలో, ఈ ప్రాంతం ప్లేస్ విక్టర్ హ్యూగోకు సమీపంలో ఉందని నిర్ధారణైంది. అంతేకాదు, యూరో న్యూస్ కథనం ప్రకారం, జనవరి 11న ప్లేస్ విక్టర్ హ్యూగో నుంచి ట్రొకడెరో వరకు ఇరాన్ నిరసనలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
ఈ వివరాల ఆధారంగా, ప్లేస్ విక్టర్ హ్యూగో ప్రాంతంలోని గూగుల్ స్ట్రీట్ వ్యూ చిత్రాలను పరిశీలించగా, వైరల్ వీడియోలో కనిపించిన భవనాలు అక్కడి నిర్మాణాలతో పూర్తిగా సరిపోలాయి..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959