కేటీఆర్‌కు మరొక ప్రతిష్టాత్మిక ఆహ్వానం..

కేటీఆర్‌కు మరొక ప్రతిష్టాత్మిక ఆహ్వానం..

న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ నిర్వహించనున్న 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం..

తెలంగాణను ప్రపంచ పటంలో అగ్ర స్థానంలో నిలిపిన తీరును గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికలపై తన ఆలోచనలు పంచుకోవాలని, ఏప్రిల్ 4, 2026వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ప్రసంగించాలని కేటీఆర్‌ను ఆహ్వానించిన నిర్వాహకులు..

విశిష్ట వక్తగా కేటీఆర్‌ను ఆహ్వానించడం గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్న నిర్వాహకులు..

బీఆర్‌ఎస్ హయాంలో మంత్రిగా ఆయన చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959