శ్రద్ధ శ్రీయోగాచార్యులు,ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బహార్ అలీ, పీస్ యోగవిద్యాలయం..
ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఈ నెల 18తేదీ నుండి 31వ తేదీ వరకు 14 రోజులు పాటు ఉచితంగా ఆన్లైన్ ద్వారా యోగ,ఆయుర్వేదం,ప్రకృతి వైద్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతుల్లో యోగా ప్రాణాయామం, ధ్యానం, ఆయుర్వేదము ప్రకృతి వైద్యం, ఫుడ్ & న్యూట్రిషన్ గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో విద్యార్థిని, విద్యార్థులు బాలబాలికలు, యువతి యువకులు, మహిళ మహారాణులు, పురుషులు, పెద్దలు, అనారోగ్యలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వాట్సప్ ద్వారా ఒక గ్రూపుని తయారు చేయడం జరిగింది. ఈ గ్రూపు లింకుని మీ అందరికీ పంపించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఉచిత ఆన్లైన్ యోగా శిక్షణలో జాయిన్ అవ్వాలని తెలిపారు. యోగా నేర్చుకోవాలని తపనతో ఉంటే ఈ గ్రూపులో జాయిన్ కావాలని సూచించారు. ఈ 14 రోజుల్లో యోగా శిక్షణలో తప్పకుండా 10 క్లాసులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ కాకపోతే 100రూపాలు జరిమానా కట్టవలసి ఉంటుంది. దీనికి సిద్ధంగా ఉంటేనే ఈ ఆన్లైన్ యోగ శిక్షణ శిబిరంలో పాల్గొనాలని యోగాచార్యుడు షేక్. బహార్ అలీ తెలిపారు. ఈ ఫోన్ నెంబర్ 7396126557 నమో చేసుకోవాలని కోరారు.