ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 18 – 01 – 2026,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *అమావాస్య* రా1 17 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* ఉ10.41 వరకు,
యోగం : *హర్షణం* రా9.59 వరకు,
కరణం : *చతుష్పాత్* మ12.37 వరకు,
తదుపరి *నాగవం* రా1.17 వరకు,
వర్జ్యం : *రా7.13 – 8.56*
దుర్ముహూర్తము : *సా4.14 – 4.58*
అమృతకాలం : *ఉ7.12 వరకు*
మరల *తె5.28 నుండి*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండం : *మ12.00 – 1.30*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.43,
*_నేటి విశేషం_*
*చొల్లంగి అమావాస్య*
పుష్య మాసం లోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు.
ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది.
శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడిగా, వీరరాఘవునిగా ఆవిర్బవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్యనే.
అందుకే ఈరోజున మనం ఎంత భక్తి శ్రద్దలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది…
ఈ అమావాస్యకి రోగ హరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్పియున్నారు.
అలానే ఎవరైనా దీర్ఘ కాలిక వ్యాధులతో భాధ పడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచం బియ్యం పిండి,పంచదార, (చూర్ణo చేసుకోవాలి )దానికి కొంచం యాలకులు పొడి కలిపి అవునెయ్యి వేసి విష్ణు సహస్ర నామo పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్దాన్ని దీపం కొండెక్కిన తరువాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదం గా తీసుకోవడం చాలా మంచిది.
అలానే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసేవిధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలశం లో గాని నీటి పాత్రలో గానీ వేయాలి.
ఇలా చేయడం ద్వారా ద్రుష్టి దోష ప్రభావం తగ్గుతుంది, అప మృత్యు దోషాలు సైతం తగ్గుతాయి…
ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు, లేదా దీర్ఘ కాలిక వ్యాధులతో భాధ పడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలానే భగవంతునికి నివేదన చేసిన పాణకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీ పాద తీర్థo గా తలచి అందరూ స్వీకరించాలి.
ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీస్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషం.
పితృ దేవతలకు తర్పణలు పెట్టుకోవడానికి చాలా విశేష మైనది.
పితృదేవతలకు ప్రీతిగా అన్నార్తులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించడం చాలా విశేషం …..
భగవద్బంధువులు అందరూ అవకాశం ఉంటే ఈ చొల్లంగి అమావాస్య నాడు విష్ణు సంబందిత ఆలయదర్శనం చేసుకోగలరు.
ఆనాడు సకల దేవతా స్వరూపమైన గోమాతకు దానా అందించడం కూడా చాలా మంచిది..!!
పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు.
గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది…
ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.
*పుష్య బహుళ అమావాస్య* అయిన ఈ రోజు, సింహాచలం కొండ దిగువ భాగంలోని అడవివరంలో గల ఉద్యానవనం, పుష్కరణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్నకు తెప్పతిరునాళ్ళు జరుగుతాయి.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏