తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కీలక భేటీ.

తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కీలక భేటీ.

తెలంగాణ కేబినెట్‌ ఎజెండాలో కీలక అంశాలు

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ప్రధాన చర్చ

ఎన్నికల నిర్వహణపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చ

మేడారం మాస్టర్ ప్లాన్‌పై చర్చించనున్న కేబినెట్.

పొట్లపూర్ ఎత్తిపోతలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.

తెలంగాణ సర్కార్ ఛలో మేడారం అంటోంది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్‌ వేదికగా కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు.. మొత్తం కలిపి దాదాపు 3 వందల మంది బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. 90 శాతం మంది మంత్రులు గ్యారంటీగా హాజరుకానున్నారు..హరిత హోటల్ పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క శనివారం ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగడం ఆనవాయితీ. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో క్యాబినెట్ కొలువు దీరడం.. ఒక చరిత్రాత్మకఘట్టం. పైగా జనవరి 28 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న క్రమంలో మేడారంలోనే కేబినెట్ మీటింగ్ జరగాలని సీఎం ప్లాన్ చేయడంపై ఆసక్తి పెరిగింది. రైతు భరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం లాంటి అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959