జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..
క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్
బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ వెల్లడి.
ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని ప్రకటించిన కేసీఆర్.
నంది నగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం
చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్న కేసీఆర్
65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేసిన కేసీఆర్
తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని స్పష్టీకరణ.
జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపణ..
సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును ఉటంకించిన కేసీఆర్..
ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టీకరణ..
ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని వెల్లడి..
హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శ..
పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేసీఆర్ హెచ్చరిక..
నంది నగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానన్న మాజీ సీఎం KCR
అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కేసీఆర్ వ్యాఖ్య.
భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచన..
ఏపీ హైకోర్టులోని ‘వీడీ మూర్తి’ కేసు తీర్పును లేఖలో ప్రస్తావించిన కేసీఆర్…
పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన.
సిట్ అధికారులు నందినగర్లోని తన ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి ఆయన లేఖ రాశారు. చట్టపరమైన అభ్యంతరాలున్నా తాను విచారణలో సిట్కు సహకరిస్తానని చెప్పారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. గోడలకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదని కేసీఆర్ పేర్కొన్నారు. సిట్ పోలీసుల వైఖరి కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలిపారు. పోలీసుల తీరు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని వెల్లడించారు. ఏసీపీ వెంకటగిరికి తనను విచారించే అధికార పరిధి లేదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని తెలిపారు..