కాంగ్రెస్‌ పార్టీ జూమ్‌ మీటింగ్‌..!

కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది.
ఈ సమావేశం జూమ్‌ మీటింగ్‌ ద్వారా నిర్వహించబడుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌,
పార్టీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొననున్నారు..

ముఖ్యంగా రానున్న మున్సిపల్‌ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, బీఫామ్‌ల జారీ అంశాలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వ్యూహం, స్థానిక రాజకీయ పరిస్థితులపై కూడా సమీక్ష చేసే అవకాశముంది.