హీటెక్కిస్తున్న గద్వాల మున్సిపల్ రాజకీయాలు..

హీటెక్కిస్తున్న గద్వాల మున్సిపల్ రాజకీయాలు..

_• 19 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ క్యాంప్.._
_• 18 మంది కౌన్సిలర్లతో బీఆర్ఎస్, బీజేపీ శిబిరం.._

_• ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.._
_• మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్ల మద్దతు పెరుగుతుందని బీఆర్ఎస్ ధీమా..

ఉమ్మడి పాలమూరులో హంగ్

ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితులు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి.

నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి..