మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు…

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు.

🔹 మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ
🔹 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత.

*పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:*
▪️ మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ
▪️ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు.

*వేసవి సెలవులు:*
▪️ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
▪️ జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం.

*రంజాన్ ప్రత్యేక వెసులుబాటు:*
▪️ ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు
▪️ ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
▪️ మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ

– పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

మార్చి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే బడులు నడుపుతారు. 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుపుతారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి స్పెషల్‌క్లాసులు నడుస్తాయి. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వర కు వేసవి సెలవులు ఇస్తారు. జూన్‌ 12 నుంచి 2026 -27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. రంజాన్‌ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్‌ కాలేజీలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట నిర్వహించే వెసులుబా టు ఇచ్చింది. ఉదయం 8 నంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు వీటిని నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ పేర్కొన్నారు. మార్చి 20 తర్వాత బడులు, డైట్‌ కాలేజీలను అదనంగా నడుపాల్సి ఉంటుందని స్పష్టంచేశారు..