వెనక్కి తగ్గని ఆంథ్రోపిక్..
రంగంలోకి ఓపెన్ఏఐ..
వివాదానికి కారణం ఏంటి?.
అమెరికా రక్షణశాఖ డిమాండ్లకు తలొగ్గని ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్‌కు (Anthropic) గట్టి షాక్ తగిలింది. ఆ సంస్థతో ఇకపై ఎటువంటి వ్యాపార సంబంధాలు ఉండవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు వెంటనే ఆంథ్రోపిక్ టెక్నాలజీ వాడకాన్ని నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ అయిన ఓపెన్ఏఐ (OpenAI) తో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
వివాదానికి కారణం ఏంటి?.
తమ క్లాడ్ (Claude) ఏఐ మోడల్స్‌ను అమెరికా సైన్యం అపరిమితంగా వినియోగించుకునేలా యాక్సెస్ ఇవ్వాలని పెంటగాన్ గతంలో ఆంథ్రోపిక్‌ను కోరింది. ఇందుకు శుక్రవారం వరకు సమయం ఇచ్చింది. అయితే, ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని పేర్కొంటూ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ నిరాకరించారు. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఆ సంస్థను ప్రభుత్వ వ్యవహారాల నుండి తప్పించారు.
వేగవంతమైన పురోగతి..
ఐదేళ్ల క్రితం కంప్యూటర్‌తో వ్యాసం రాయించడం అసాధ్యమైనది, ఇప్పుడు మానవ మెదడు స్థాయికి ఏఐ చేరింది. డేటా, కంప్యూటింగ్ శక్తి పెరగడంతో సామర్థ్యం ఆకాశానికి తాకుతోంది. ఆర్థిక, భద్రతా ప్రభావాలు కొందరికి నచ్చడం లేదు. అపార్థం కొంటున్నారు. అపోహలు పెంచుతున్నారు. సురక్షిత ఏఐ కోసమే ఓపెన్ ఏఐ వదిలేసి ఆంథ్రోపిక్ స్థాపించామని డారియో వెల్లడించారు.
భారత్‌తో భాగస్వామ్యం
బహుళజాతి సంస్థలు భారత్‌ను కేవలం మార్కెట్‌గా చూస్తునర్నాయి. ఇప్పుడుఆంథ్రోపిక్ కూడా ఇలాగే భారత్‌తో భాగస్వామ్యం కోరుకుంటోంది. ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలతో కలిసి పనిచేయాలని ఆంథ్రోపిక్ భావిస్తోంది. ఏపీఐలతో స్వదేశీ సేవలు బలపడతాయి. ఉద్యోగాలపై ఎలాంటిపభావం ఉండదని డారియో వెల్లడించారు. గత అక్టోబర్ నుంచి వాడుక, ఆదాయం రెట్టింపు అయింది.
రంగంలోకి ఓపెన్ఏఐ..
ఈ పరిణామాల నేపథ్యంలో ఓపెన్ఏఐ రక్షణశాఖతో జతకట్టింది. దీనిపై ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్టమన్ స్పందిస్తూ, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగంపై పెంటగాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇరువర్గాల అంగీకారానికి లోబడే ఏఐ మోడల్స్ పనిచేస్తాయని, అందుకు అవసరమైన సాంకేతిక నిబంధనలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
వెనక్కి తగ్గని ఆంథ్రోపిక్..
ప్రభుత్వ నిషేధంపై ఆంథ్రోపిక్ సంస్థ స్పందిస్తూ తమ నైతిక విలువలకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. సైనిక నిఘా వ్యవహారాల్లో ఏఐ వినియోగానికి సంబంధించి తాము పెట్టుకున్న కఠిన నిబంధనలను ఉల్లంఘించలేమని, బెదిరింపులకు లొంగబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది.