విండీస్ పై భారత్ ఘనవిజయం..సెమీఫైనల్-2 లో ఇంగ్లండ్, భారత్ తలపడనున్నాయి…!.

సెమీస్ లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. విండీస్ పై ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల టార్గెట్ ను భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను గెలిపించాడు. సంజూ 50 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ నెల 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్-2 లో ఇంగ్లండ్, భారత్ తలపడనున్నాయి. ఈ నెల 8న ఫైనల్ జరగనుంది..

సంజు సామ్సన్ ఒక ఎండ్‌లో దృఢంగా నిలిచాడు, 50 బంతుల్లో నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో సహా అజేయంగా 97 పరుగులు చేశాడు.

చివరి 5 ఓవర్లలో వెస్టిండీస్ 70 పరుగులు..
ఒకానొక సమయంలో కరేబియన్ జట్టు స్కోరు 15 ఓవర్లలో 125/4. చివరి 5 ఓవర్లలో జట్టు 70 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్ 5వ వికెట్‌కు 35 బంతుల్లో అజేయంగా 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ షాయ్ హోప్, రోస్టన్ చేజ్ 53 బంతుల్లో 68 పరుగులు జోడించారు..

చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, సూర్య సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు….

మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో..

మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ..సెమీఫైనల్-2 లో ఇంగ్లండ్, భారత్ తలపడనున్నాయి..

Make way for Team India!

The defending champions make the ICC Men’s T20 WC semi-finals for the 6th time