సనోజ్ మిశ్రా పై మోనాలిసా సంచలన ఆరోపణలు..

తాజాగా తన భర్తతో కలిసి మోనాలిసా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రా పై సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలిసిన ఒక సినీ దర్శకుడు సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనకు, తన భర్తకు ప్రాణ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరింది. దర్శకుడు తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని, తన సినిమాల్లో తనకు అవకాశం ఇవ్వడం లేదని కూడా ఆమె ఆరోపించింది. “అతని సినిమాల్లో ఎవరు నటించాలనుకుంటారు? అతను చాలా చెడ్డ, అసహ్యకరమైన వ్యక్తి. సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతని పేరు పలకడానికే సిగ్గుగా ఉంది. అతడు షూటింగ్ సమయంలో పలుమార్లు శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారు. ఆ చేదు అనుభవం గురించి ఇంట్లో వారికి చెబితే మొదటి సినిమా కదా సర్దుకుపోవాలని చెప్పారని.. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని” అంటూ ఎమోషనల్ అయ్యింది.

గత ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా ఒక్కసారిగా నెట్టింట పాపులర్ అయ్యింది మోనాలిసా. ఆమె సహజ సౌందర్యం, నీలి కళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఆమె జీవితం వార్తలలో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ కోసం కుటుంబాన్ని ఎదురించి కేరళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కేరళలోని తిరువనంతపురంలోని హిందూ సంప్రదాయం ప్రకారం తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. అయితే మోనాలిసా వివాహం పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు మోనాలిసా పెళ్లి పై ఆమె బంధువు విజయ్ భోస్లే మాట్లాడుతూ మోనాలిసా మైనర్ అని.. ఈ పెళ్లి చట్టబద్ధం కాదని అన్నారు. అయితే తమ వివాహం గురించి వస్తున్న ఆరోపణలపై మోనాలిసా దంపతులు మాట్లాడుతూ.. తాము చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నామని.. ఎవరి మతాలను వారు అనుసరిస్తామని అన్నారు…..

తాజాగా తన భర్తతో కలిసి మోనాలిసా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రా పై సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలిసిన ఒక సినీ దర్శకుడు సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనకు, తన భర్తకు ప్రాణ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరింది. దర్శకుడు తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని, తన సినిమాల్లో తనకు అవకాశం ఇవ్వడం లేదని కూడా ఆమె ఆరోపించింది. “అతని సినిమాల్లో ఎవరు నటించాలనుకుంటారు? అతను చాలా చెడ్డ, అసహ్యకరమైన వ్యక్తి. సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతని పేరు పలకడానికే సిగ్గుగా ఉంది. అతడు షూటింగ్ సమయంలో పలుమార్లు శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారు. ఆ చేదు అనుభవం గురించి ఇంట్లో వారికి చెబితే మొదటి సినిమా కదా సర్దుకుపోవాలని చెప్పారని.. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని” అంటూ ఎమోషనల్ అయ్యింది..

మోనాలిసా ఆరోపణలపై సనోజ్ మిశ్రా కామెంట్..

మరోవైపు మోనాలిసా ఆరోపణలపై దర్శకుడు సనోజ్ మిశ్రా స్పందిస్తూ.. ఆమె సినిమా కోసం తాము కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని, ఆమె అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం వల్ల సినిమా దెబ్బతింటుందని వాదిస్తున్నారు. కానీ, సినిమా రిజల్ట్ కంటే ఒక మహిళ ఆత్మగౌరవం, భద్రత ముఖ్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ‘కాస్టింగ్ కౌచ్’ వేధింపులు ఇంకా కొనసాగుతుండటం విచారకరం.

మోనాలిసా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.