తొలిసారిగా వరుణుడు ఆధిపత్యం చూపాడు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ను కేటాయించారు. ప్రస్తుతం పంజాబ్ ఐదు పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన కోల్కతా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పంజాబ్ పేసర్ బార్ట్లెట్ (2/9) ధాటికి 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఆలెన్ (6), గ్రీన్ (4)లను బార్ట్లెట్ పెవిలియన్ చేర్చాడు. ఇక కేకేఆర్ 3.4 ఓవర్లలో 25/2 స్కోరుతో ఉన్నప్పుడు మ్యాచ్ను భారీవర్షం ఆటంకపరిచింది. వెంటనే ఆటగాళ్లంతా పెవిలియన్ చేరగా.. సిబ్బంది ఈడెన్ మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దాదాపు మూడు గంటల తర్వాత రాత్రి 10.30కి వరుణుడు తెరిపినిచ్చాడు. కానీ మైదానంలో అక్కడక్కడా నీటి గుంటలు ఏర్పడడంతో ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా వీలు కాలేదు. దీంతో ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.