ఈ 5 బ్రేక్ అవుట్ స్టాక్స్ ని రికమండ్ చేసిన స్టాక్ అనలిస్ట్..

ఈరోజు ట్రేడింగ్ కోసం 4 మిడ్ క్యాప్, అదేవిధంగా 1 స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన మొత్తం 5 బ్రేక్ అవుట్ స్టాక్స్ కి బై రేటింగ్ తో పాటు టార్గెట్ ప్రైజ్ ని కూడా ఇస్తున్నట్లు ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఛాయిస్ బ్రోకింగ్ కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకి సూచించడం జరిగింది.ఈ 5 బ్రేక్ అవుట్ స్టాక్స్ జాబితాలో మొదటిది లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ కాగా, రెండవది FSN ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్, మూడవది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, నాలుగవది స్టీల్ ఆథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్, చివరగా ఐదవది ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉన్నాయి..లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ షేరుకి బై రేటింగ్ తో పాటు రూ. 1700 టార్గెట్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు. అలాగే ఈ షేరుకి రూ. 1360 స్టాప్ లాస్ ని కూడా సుమీత్ బగాడియా అందించడం జరిగింది. ఇక ఈ కంపెనీ షేరుని రూ. 1436.70 ధర వద్ద కొనుగోలు చేయాలని కూడా అనలిస్ట్ తెలిపారు. చివరి ట్రేడింగ్ సెషన్ లో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ షేరు 3.7 శాతం లాభపడి రూ. 1440 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 80,940 కోట్లుగా ఉంది..FSN ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ షేరుకి బై రేటింగ్ తో పాటు రూ. 280 టార్గెట్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు. అలాగే ఈ షేరుకి రూ. 243 స్టాప్ లాస్ ని కూడా సుమీత్ బగాడియా అందించడం జరిగింది. ఇక ఈ కంపెనీ షేరుని రూ. 252.5 ధర వద్ద కొనుగోలు చేయాలని కూడా అనలిస్ట్ తెలిపారు. చివరి ట్రేడింగ్ సెషన్ లో FSN ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ షేరు 2.5 శాతం లాభపడి రూ. 252.36 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 72,270 కోట్లుగా ఉంది…