యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్ధి..!

యాదాద్రి భువనగిరి జిల్లా :

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్ధి..

సందడిగా మారిన ఆలయ పరిసర ప్రాంతాలు, కిక్కిరిసి పోయిన క్యూ లైన్లు

ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం..

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది…ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. కొండపైన ఉన్న బస్‌ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది…